- Advertisement -
బీహార్: పశ్చిమ చంపారన్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం కారణంగా ఏడుగురు మృతి చెందారు. దీంతో అధికారులు విచారణకు ఆదేశించింది. గత కొన్ని రోజులుగా మరణాలు సంభవించినప్పటికీ పోలీసు అధికారి ప్రకారం.. ఆదివారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
లౌరియా పోలీస్ స్టేషన్ పరిధిలోనే అన్ని మరణాలు సంభవించాయని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) శౌర్య సుమన్ ధృవీకరించారు. కల్తీ మద్యం సేవించడం వల్లే ప్రాణనష్టం జరిగిందని స్థానికులు పేర్కొంటుండగా, గత రెండు మరణాలకు మద్యం వల్ల సంబంధం లేదని ఎస్పీ స్పష్టం చేశారు.ఈ మరణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
- Advertisement -