Saturday, December 21, 2024

రక్తమోడిన రోడ్లు

- Advertisement -
- Advertisement -

వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత

ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఐదుగురు, సూర్యాపేటలో అక్కాతమ్ముడు దుర్మరణం

మనతెలంగాణ/రఘునాథపల్లి/ములుగు/సూర్యాపేట రూరల్: వివిధ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు టైర్ పేలి డివైడర్‌ను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అదేవిధంగా ఏటూరు నాగరంలో కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు, సూ ర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కొమటిపల్లి గ్రా మంలో బైక్‌పై వెళుతున్న టాటా వాహనం ఢీకొని అక్కాతమ్ముడు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో వరంగల్ జాతీయ రహదారిపై వెళుతుండగా తవేరా వాహనం టైర్ పేలి అదుపుతప్పి పల్టీలు కొట్టి ఢీవైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

ఈ ఘ టనలో మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా, మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పర్ధన్‌బే గం(50), అఫ్రీన్‌బేగం(40), సాకేత్ హుస్సేన్(53) మృతిచెందారు. రిహాన్‌బేగం, హయత్ అలీ, మరో ఇద్దరు మహిళలు వరంగల్‌లో చింతల్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్‌లో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతుండగా జరిగిన ప్రమాదంలో తవేరా సుమారు 60 మీటర్ల దూరం నుంచి వేగంగా పల్టీలు కొట్టుకుంటూ బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడడంతో భయానక వాతావరణం నెలకొంది. కాగా, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారు ను ఢీకొనడంతో కారులో ఉన్న వల్లాల కృష్ణయ్య (45), వరంగల్‌కు చెందిన శివ (17) అక్కడికక్కడే మృతిచెందా డు.

మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతులు ములుగు మండ లం జాకారం, వరంగల్‌కు చెందినవారిగా గుర్తించారు. తు నికాకు సేకరణ కోసం చత్తీస్‌గఢ్‌కు వెళ్లివస్తుండగా ప్రమా దం జరిగిందని పోలీసులు తెలిపారు. సూర్యపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కొమటిపల్లి గ్రామంలో బొడ్రా యి ఉత్సవాలకు కొమటిపల్లి గ్రామానికి చెందిన మాండ్ర శేఖర్(26), గాంధీనగర్ గ్రామానికి చెందిన అతని అక్క పెడబోయిన రజిత(35) బైక్‌పై వెళుతుండగా బాలెంల శివారులో టాటా వాహనం ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఘటనలో వీరిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. గంటలోపు గ్రామానికి చెరుకునేలోపే రోడ్డు ప్రమాదంరూపంలో మృత్యువు ఒడిలోకి జారుకున్నారు. రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముళ్లు మృతిచెందడంతో గాంధీనగర్, కొమటిపల్లి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News