Sunday, January 5, 2025

ఎయిర్ ఇండియా విమానంలో కుదుపులు.. ఏడుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం భారీ కుదుపుల వల్ల ఏడుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో ఎవరూ ఆస్పత్రికి చేరే పరిస్థితి లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఎయిరిండియా బీ 787 800 విమానం ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా లోని సిడ్నీకి బయలు దేరింది.

విమానం గాలిలో ఉన్నప్పుడే ఒక్కసారి కుదుపులకు గురైంది. ప్రయాణికుల్లో ఏడుగురు తీవ్రంగా వణికిపోగా, విమానసిబ్బంది, ప్రయాణికుల్లోని ఓ వైద్యుడు , నర్సు సహాయంతో ప్రథమ చికిత్స చేశారు. విమానం సిడ్నీ ఎయిర్ పోర్టుకు చేరగానే వారందరికీ వైద్య పరీక్షలు చేశారు. అందులో ముగ్గురు వైద్యసాయం తీసుకున్నారని, మరెవరికీ ఆస్పత్రిలో చేర్చవలసిన అవసరం రాలేదని సిడ్నీ లోని ఎయిర్ ఇండియా మేనేజర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News