Friday, March 14, 2025

ఎంపిలో రెండు వాహనాలను ఢీకొన్న ట్యాంకర్..ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాలో ఓ గ్యాస్ ట్యాంకర్ కారు, జీపును ఢీకొనడంతో ఏడుగురు వ్యక్తలు మరణించారని, ముగ్గురు గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. ఈ దుర్ఘటన బుధవారం రాత్రి 11.00 గంటలకు జరిగింది. బద్నావర్‌ఉజ్జయిని హైవేలో బమన్సుత గ్రామం వద్ద రాంగ్‌సైడ్ వచ్చిన ట్యాంకర్ దానికి ఎదురుగా వస్తున్న కారు, జీపును ఢీకొందని ధార్ పోలీస్ సూపరింటెండెంట్(ఎస్పీ) మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారని, మరి ముగ్గురు హాస్పిటల్‌లో గాయాలతో చనిపోయారని, వారంతా ఎంపీలోని మందసర్ రత్నం, రాజస్థాన్‌కు చెందిన జోధ్‌పూర్ జిల్లాలకు చెందినవారని సమాచారం.

చనిపోయిన వారిలో నలుగురు కారులో ప్రయాణించగా, ముగ్గురు జీపులో ప్రయాణించారని పోలీసు వర్గాలు తెలిపాయి. సమాచారం అందగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటన జరగగానే ట్రక్ డ్రయివర్ పరారయ్యాడు. చనిపోయినవారిలో గిర్‌ధారి మఖిజా(44), అనిల్ వ్యాస్ (43), విక్రం ధంగర్, చేతన్(23) మందసర్, రత్నం కు చెందినవారని, వారు కారులో ప్రయాణించారని, కాగా జీపులో ప్రయాణించిన బనా సింగ్, అనూప్ పున్యా(23), జితేందర్ పున్యా జోధ్‌పూర్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News