- Advertisement -
అహ్మదాబాద్ : గుజరాత్ లోని సూరత్‌లో కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించి ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 27 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఏథర్ ఇండస్ట్రీస్‌లో కెమికల్ స్టోరేజీ ట్యాంకులో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. ఈ పరిశ్రమలో ఈథర్ రసాయనం తయారు చేస్తుంటారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుజరాత్ లోని అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన అశ్విన్ దేశాయ్‌కు చెందిన కంపెనీగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రమాదం వల్ల దాదాపు 1.3 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించినట్టు అశ్విన్ దేశాయ్ వెల్లడించారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -