Wednesday, January 22, 2025

యూపీలో అంబులెన్స్.. ట్రక్కు ఢీకొని ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Seven killed in UP ambulance-truck collision

లక్నో : ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. అంబులెన్స్ , ట్రక్కు ఢీ కొనడంతో ఏడుగురు మృతి చెందారని పోలీసులు చెప్పారు. బాధితుల్లో పిల్భిత్‌కు చెందిన ఒక కుటుంబం లోని ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న తరువాత అంబులెన్స్‌లో ఢిల్లీ నుంచి తిరిగి వస్తుండగా, ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఢిల్లీ లక్నో జాతీయ రహదారిపై అంబులెన్స్ మొదట రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి, ఆపై ట్రక్కును ఢీకొట్టింది. ఫలితంగా డ్రైవర్‌తోపాటు వాహనంలో ఉన్న మరో ఆరుగురు మరణించారని పోలీసులు చెప్పారు. బాధితులందర్నీ గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News