Sunday, December 22, 2024

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు కూలీలు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఆంద్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో లారీ బోల్తా పడటంతో ఏడుగురు కూలీలు మృతి చెందారు. జంగారెడ్డి గూడెం నుంచి కూలీలు పెరవలి వెళ్తుండగా చిన్నాయిగూడెం సమీపంలో ప్రమాదవశాత్తు లారీ పంట బోదెలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయగా.. మరో వ్యక్తి గాయడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స కోసం స్థానికులు అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంగటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వివరాలు సేకరించి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News