Monday, December 16, 2024

ఏడుగురు మావోలకు రివార్డు నగదు అందజేత

- Advertisement -
- Advertisement -

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ ఇటీవల కాలంలో జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన ఏడుగురు సభ్యులకు సోమవారం ఎస్‌పి రోహిత్‌రాజు తన కార్యాలయంలో చెక్కు రూపంలో రివార్డు నగదును అందజేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు చెందిన పొడియం మంగుకు రూ.4 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిలా, చర్ల మండలానికి చెందిన మడకం ఆడిమె రూ.4 లక్షలు, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కోరం సోమయ్యకు రూ.లక్ష, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందిన సోడ్డి పొజ్జికి రూ.4 లక్షలు,

మడివి సోమిడికి రూ.4 లక్షలు, ఆళ్లపల్లి గ్రామానికి చెందిన మడకం ఇడుమయ్యకు రూ.లక్ష, లక్ష్మయ్యకు రూ.లక్ష నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ… నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ 2023=24 సంవత్సర కాలంలో లొంగిపోయిన 26 మందికి తెలంగాణ ప్రభుత్వం నుంచి మంజూరైన ఈ రివార్డు నగదును వారి పునరావాసం కోసం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ ఎస్‌పి ఆపరేషన్స్ టి. సాయిమనోహర్, దుమ్ముగూడెం సిఐ అశోక్, చర్ల సిఐ రాజువర్మ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News