Thursday, December 26, 2024

ఆయిల్ ట్యాంకర్‌లోకి దిగి ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆయిల్ ట్యాంకర్‌లోకి దిగి ఏడుగురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జి రాగంపేటలో అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది. ఓ ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు ఏడుగురు కూలీలు అందులోకి దిగారు. ఒకరు తరువాత ఒకరు ఊపిరాడక చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇద్దరు పెద్దాపురం, ఐదుగురు పాడేరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఆయిల్ ట్యాంకర్‌లో విష వాయువులు ఉండడంతో వారు ఊపిరాడక మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News