Monday, December 23, 2024

రేకుల షెడ్డుపై కూలిన వేప చెట్టు…. ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్ర అకోలా జిల్లా బాలాపూర్ మండలంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. పరాస్ గ్రామంలోని బాబుజీ మహారాజ్ మందిర్ సంస్థాన్‌లో వర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు వీయడంతో భారీ వేప చెట్టు రేకుల షెడ్డుపై కూలడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. జెసిబి సహాయంతో షెడ్ నుంచి చెట్టును బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News