- Advertisement -
బెంగళూరు: భారీ వర్షాలు పడడంతో పురాతన ఇల్లు కూలి ఏడుగురు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాదల్ అంకాల్గి గ్రామంలో ఓ ఇంట్లో కుటుంబం నివసిస్తోంది. గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడడంతో పురాతన ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మృతులు అర్జున్ కన్నగావి(48), సత్యవ్వ ఖన్నగావి(45), లక్ష్మి(17), పూజా(08), గంగవ్వ ఖన్నగావి(50), సవిత ఖన్నగావి(16), కేశవ(08)గా గుర్తించారు. సిఎం బసవరాజు, ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని సిఎం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఎక్ష్సగ్రేషియా ఇస్తామని వెల్లడించింది.
- Advertisement -