Friday, December 20, 2024

ఢిల్లీలో అగ్ని ప్రమాదం: ఏడుగురు సజీవదహనం…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని గోకుల్‌పురి బస్తీలో శనివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ పూరి గుడిసెలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు అంటుకోవడంతో క్రమంగా చుట్టుపక్కల గుడిసెలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 60 గుడిసెలు అగ్ని ఆహుతి కావడంతో ఏడుగురు చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది 13 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.  మంటలను అదుపులోకి తీసుకొని రావడానికి నాలుగు గంటల సమయం పట్టిందని డిఎస్ పి దేవేశ్ కుమార్ మహ్లీ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News