- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారని స్థానిక మీడియా వెల్లడించింది. సెంట్రల్ ముంబయిలోని తాడ్‌దేవ్ ప్రాంతంలో 20 అంతస్థుల గల కమలా బిల్డింగ్‌లోని 18వ ఫ్లోర్‌లో మంటలు చెలరేగడంతో దట్లమైన పొగలు కమ్ముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 18వ ఫ్లోర్‌లో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 13 అగ్నిమాపక యంత్రాలు, 12 వాటర్ ట్యాంక్ లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయిస్తున్నారు.
- Advertisement -