Wednesday, January 22, 2025

జర్మనీలో కాల్పులు: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

బెర్లీన్: జర్మనీలోని హమ్‌బర్గ్ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ చర్చిలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఏడుగురు చనిపోయారు. ఈ కాల్పుల్లో 25 మంది గాయపడినట్టు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మూడంతస్థుల భవనంలో చర్చి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో కాల్పులు జరిగినట్టు సమాచారం. 2020 పిభ్రవరిలో అగంతకుడు కాల్పులు జరపడంతో తొమ్మిది మంది చనిపోయారు. 2019 అక్టోబర్‌లో ఓ గన్‌మెన్ కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. కాల్పులు జరిపిన దుండగుడు కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికులు బయటకు రావొద్దని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తనకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News