- Advertisement -
లక్నో: వివిధ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బారాబంకి జిల్లా రాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగి ఉన్న బస్సు ట్రక్కు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. నేపాల్ నుంచి గోవాకు వెళ్తుండగా బస్సు టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి టైర్ మార్చుతుండగా టక్కు అదుపుతప్పి వచ్చి బస్సు ఢీకొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.
అస్సాంలోని బిశ్వనాథ్ ప్రాంతంలో కారును ట్రక్కు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -