Monday, December 23, 2024

ట్రక్కు-అంబులెన్స్ ఢీ: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Seven Members dead in UP Road accident

లక్నో: ట్రక్కు-అంబులెన్స్ ఢీకొన్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం రాయ్ బరేలీ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆరుగురికి ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఢిల్లీ వెళ్లి చెక్ చేసుకొని ఇంటికి వస్తుండగా ఫతేగంజ్ పోలీస్ స్టేషన్ పరధిలో అంబులెన్స్-ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు.  రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం భయకరంగా జరిగింది. ఈ ఘటనపై యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News