Sunday, December 22, 2024

బాచుపల్లిలో పెను విషాదం… గోడకూలి ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ లోని బాచుపల్లిలో పెను విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం భారీ వర్షాలు కురవడంతో రేణుక ఎల్లమ్మ కాలనీలో గోడకూలి ఏడుగురు మృతి చెందారు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఏడు మృతదేహాలను బయటకు తీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులు రామ్ యాదవ్(35), గీతా(34), రాజు(25), శంకర్(22), తిరుపతి రావు(20),ఖుషి(18), హిమాన్షు(4)గా గుర్తించారు. ఇప్పటికైనా శిథిలావస్థకు చేరిన ఇండ్లను జిహెచ్ఎంసి అధికారులను కూల్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News