Thursday, January 23, 2025

కర్నాటకలో బస్సు ప్రమాదం : ఏడుగురు మృతి… తెలంగాణ వాసులే

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం కలబురి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ ఉదయం కమలాపూర్ ప్రాంతంలో టెంపో ట్యాక్స్, బస్సు ఢీకొన్నాయి. వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో ఏడుగురు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  బస్సు 29 మంది ప్రయాణికులతో గోవా నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా తెలంగాణ వారేనని పోలీసులు సమాచారం ఇచ్చారు.  అగ్నిమాపక సిబ్బంది యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. అర్జున్ కుమార్ కూతురు పుట్టిన రోజు వేడుకలను గోవాలో జరుపుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు అర్జున్ కుమార్, సరళ, ముకుంద్ రావు, ఖుషి, స్నేహలత, కల్పనగా గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News