Friday, December 20, 2024

భారీ ప్రాసెసింగ్ యంత్రం కూలి ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

విజయపుర (కర్ణాటక) : అలియాబాద్ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో మంగళవారం భారీ ప్రాసెసింగ్ యంత్రం కూలి ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మృతులు బీహార్‌కు చెందినవారు. గొడౌన్‌లో 100 టన్నుల ధాన్యం కుప్ప కింద ఇరుక్కోవడంతో వారు చనిపోయారని పోలీస్‌లు చెప్పారు.

అయితే పంటకుప్ప కింద ఇరుక్కోని ముగ్గురు గాయపడ్డారు. పంటకుప్ప కింద చిక్కుకున్న వారిలో ఏడుగురు చనిపోగాఒకరిని రక్షించ గలిగినట్టు విజయపుర పోలీస్ సూపరింటెండెంట్ సోనావేన్ రిషికేష్ భగవాన్ పేర్కొన్నారు. గలాటాలతో కూడిన ఈ యంత్రం ధాన్యాన్ని ప్రాసెస్ చేస్తుండగా, ధాన్యంతో ఉన్న చాలా బరువైన గలాటాలు కూలిపోవడంతో దాని కింద పనిచేస్తున్న కార్మికులు చిక్కుకు పోయారని పోలీస్ అధికారి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News