Friday, November 22, 2024

కర్నాటకలో విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా షిరూర్‌లో మంగళవారం భారీ స్థాయిలో కొండ చరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితోసహా ఏడుగురు వ్యక్తులు మరణించారు. 66వ నంబర్ జాతీయ రహదారిపై బడ్డీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మట్టిపెళ్లల కింద చిక్కుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు.

కొండ చరియలు విరిగిపడడంతో ఒక గ్యాసు ట్యాంకరు పక్కనే ఉన్న గంగానదిలో పడిపోయింది. ఆ సమయంలో బడ్డీ కొట్టు దగ్గర టీ తాగుతున్న ట్యాంకరు డ్రైవర్, క్లీన్ కూడా మట్టి పెళ్లల కింద చిక్కుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. కాగా..కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 10 నుంచి 15 మంది గంగావలి నదిలో కొట్టుకుపోవనట్లు తనకు సమాచారం అందిందని కార్వార్ ఎమ్మెల్యే సతీష్ సెయిల్ అసెంబ్లీలో తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News