Monday, December 23, 2024

యుపిలో భారీ వర్షాలకు ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Seven people died due to heavy rains in UP

ఇటావా(యుపి): ఎడతెరపి లేకుండా గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలకు వివిధ ప్రదేశాలలో ఇళ్ల గోడలు కూలి ఏడుగురు వ్యక్తులు మరణించారు. బుధవారం రాత్రి సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని చంద్రపుర గ్రామంలో గోడ కూలి ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు పిల్లలు మరణించారు. ఈ సంఘటనలో ఆ పిల్లల నాయనమ్మ చాందిని దేవి(70), ఒక ఐదేళ్ల చిన్నారి గాయపడ్డారని జిల్లా మెజిస్ట్రేట్ అవనీష్ కుమార్ రాయ్ తెలిపారు. ఏక్‌దిల్ పోలీసు సేష్టన్ పరిధిలోని కృపాల్‌పూర్ గ్రామంలో ఒక పెట్రోల్ పంపునకు చెందిన ప్రహరి గోడ కూలిపోయి ఒక వృద్ధ దంపతులు మరణించారు. చకర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అందవ కే బంగ్లాన్ గ్రామంలో భారీ వర్షానికి ఇల్లు కూలిపోయి జబేర్ సింగ్(35) అనే వ్యక్తి సజీవ సమాధి అయ్యాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News