Sunday, December 22, 2024

అమెరికాలో టోర్నడోల ధాటికి ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

సెల్మా: అమెరికాలోని జార్జియా, అల్బామా తదితర ప్రాంతాలను సుడిగాలులు అతలాకుతలం చేశాయి. టోర్నడోల ధాటికి ఏడుగురు మృత్యువాత పడ్డారు. తీవ్రమైన సుడిగాలులు వల్ల చారిత్రాత్మక డౌన్‌టౌన్ సెల్మాలో భవనాలు దెబ్బతినగా వీధుల్లో కార్లు బలమైన గాలుల వల్ల తల్లకిందులయ్యాయి. అధికార వర్గాలు గాలి తుపాను సృష్టించిన పెను నష్టాన్ని అంచనావేస్తున్నట్లు తెలిపారు. గురువారం రాత్రి గాలి తుపాను మొదలైన తర్వాత జార్జియా, అల్బామా రెండు రాష్ట్రాల్లో విద్యుత్ నిలిచిపోవడంతో వేల సంఖ్యలో ప్రజలు చీకట్లోనే రాత్రంతా గడపాల్సి వచ్చింది. పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉండే సెల్మాలో అధికార యంత్రాంగం వీధుల్లోని బహిరంగ ప్రాంతంలో సెల్‌ఫోన్ల సాయంతో సమావేశం నిర్వహించి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అలబామాలోని కౌంటీలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు తెలిపాయి.

టోర్నడో విజృంభించడంతో సుమారు 40నివాసాలు ధ్వంసమయ్యాయి. 32కిలోమీటర్ల రహదారి గురైందని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ఎర్నీ బాగ్గెట్ట్ తెలిపారు. 12మంది పౌరులు తీవ్రంగా గాయపడటంతో వారినిరెస్కూ సిబ్బంది ఆసుపత్రికి తరలించారని బ్రాగ్గెట్ట్ మీడియాకు తెలిపారు.తమ సిబ్బంది గాలి తుపాను ధాటికి నేలకూలిన చెట్లను తొలగించి, ఆపదలో ఉన్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారని ఎర్నీ వివరించారు. జార్జియాలో గాలికి చెట్టు కూలి వాహనంపై పడటంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అట్లాంటాలో తుపాను తీవ్రతకు గూడ్సురైలు పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. దక్షిణ అట్లాంటాలోని గ్రిఫిన్‌లో ఓ అపార్టుమెంటుపైన చెట్లు కూలడంతో కొంతమంది ఫ్లాట్లలో చిక్కుకుపోయారని మీడియా నివేదించింది. జాతీయ వాతావరణశాఖ నివేదిక ప్రకారం అమెరికా దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో 33టోర్నడోలు విరుచుకుపడ్డాయి.

మిసిసిపి, అలబామా, టెన్నెస్సే, కెంటకి, దక్షిణ కరోలినా, ఉత్తర కరోలినాలో బలమైన సుడిగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. సెల్మాలో సుడిగాలి తీవ్రతకు రహదారి కోతకు గురైందని, భవనాలు, ఓక్‌చెట్లు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్మా మేయర్ జేమ్స్ పెర్కిన్స్ మాట్లాడుతూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అయితే గాలి తుపాను ధాటికి చాలామంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News