డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాధ్ లో యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్ప కూలి ఏడుగురు దుర్మరణం పొందారు. మృతుల్లో ఓ పైలట్ , ఆరుగురు యాత్రికులు ఉన్నారని అధికారులు తెలిపారు. కేదారినాధ్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరం లోని గరుడఛట్టీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీకి చెందిన ఆర్యాన్ విమానయాన సంస్థ బెల్ 407 హెలికాప్టర్ వీటీ ఆర్‌పీఎస్ ఈ ప్రమాదానికి గురైందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఆరుగురు యాత్రికులతో గుప్తకాశీ లోని ఫటా హెలిప్యాడ్ నుంచి కేదార్‌నాథ్ వెళ్లేందుకు బయలుదేరిన హెలికాప్టర్ కొద్ది సేపటికే కుప్పకూలింది. వెంటనే మంటలు అంటుకోవడంతో మొత్తం ఏడుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామని, పరిస్థితులను పరిశీలిస్తున్నామని ట్వీట్ చేశారు.
కేదారినాధ్‌లో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -