Wednesday, January 22, 2025

ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్ కారు.. ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

కారు రేసింగ్ ఈవెంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రేస్ కారు ట్రాక్ నుంచి అదుపుతప్పి ప్రేక్షకులు, రేస్ అధికారులపైకి దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆదివారం శ్రీలంకలో మిలిటరీ అకాడమీ దియతలావా, శ్రీలంక ఆటోమొబైల్ స్పోర్ట్స్(SLAS) సహకారంతో ఫాక్స్ హిల్ సూపర్ క్రాస్ 2024 కారు రేసింగ్ 28వ ఎడిషన్ ను దియతలావాలో నిర్వహించింది. అయితే, రేసింగ్ జరుగుతుండగా రెండు రేస్ కార్లు అదుపు తప్పి ప్రేక్షకులపై దూసుకెళ్లాయని పోలీసు మీడియా ప్రతినిధి డీఐజీ నిహాల్ తల్దువా తెలిపారు.

ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారితో సహా ఏడుగురు మృతి చెందినట్లు చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వారిని దియాతలావ ప్రాథమిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని బదుల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతులు శ్రీలంకలోని అవిస్సావెల్లా, మాతర, అకురెస్సా, సీదువా ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం తర్వాత, ఈవెంట్‌లోని మిగిలిన రేసులు రద్దు చేశారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News