- Advertisement -
శ్రీనగర్ : వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమి తరువాత జమ్మూ కశ్మీర్‌లో కొన్ని చోట్ల సంబరాలు జరిగాయి. ఈ విధంగా వ్యవహరించిన స్థానిక షేర్ ఎ కశ్మీర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో చదివే ఏడుగురు విద్యార్థులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) పరిధిలో కేసులు దాఖలు చేశారు. విద్యార్థులు భారత్ ఓటమి పట్ల బాణసంచా పేల్చడం, వేడుక నిర్వహించుకోవడం, పాకిస్థాన్ అనుకూల నినాదాలకు దిగారని పోలీసులు పేర్కొన్నారు. ఆరోజు ఈ వర్శిటీకి చెందిన విద్యార్థులు వ్యహరించిన తీరును , స్థానికేతరులను వారు బెదిరించడాన్ని ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు వారి అరెస్టులు జరిగాయి.
- Advertisement -