Thursday, January 23, 2025

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

గువాహటి : అసోం లోని గువాహటిలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఏడుగురు మృతి చెందారు. ప్రాథమిక విచారణ ప్రకారం మృతులు ఏడుగురూ విద్యార్థులని గువాహటి జాయింట్ పోలీస్ కమిషనర్ తుటే ప్రతీక్ విజయ్‌కుమార్ చెప్పారు. మృతులు అస్సాం ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు.

ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గువాహటి లోని జలుక్‌బరి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి పికప్ వ్యాన్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీస్‌లు చెప్పారు. ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ధాటికి రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News