Saturday, December 21, 2024

లింబో స్కేటింగ్‌లో ఏడేళ్ల చిన్నారి గిన్నిస్ రికార్డు

- Advertisement -
- Advertisement -

Seven-year-old girl holds Guinness record for limbo skating

ముంబై : పుణెకు చెందిన ఏడేళ్ల చిన్నారి దేశ్నా ఆదిత్య నాహర్ లింబో స్కేటింగ్‌లో 20 కార్ల కింద నుంచి అత్యంత వేగంగా దూసుకెళ్లి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. 193 అడుగుల దూరాన్ని చేరుకునేందుకు 13.74 సెకన్ల సమయం మాత్రమే తీసుకుని అబ్బుర పరిచింది. గతంలో చైనాకు చెందిన 14 ఏళ్ల బాలిక పేరున ఉన్న 14.15 సెకన్ల రికార్డును తిరగ రాసింది. లింబో స్కేటింగ్‌ను రోలర్ లింబోగా కూడా పిలుస్తారు. అడ్డంగా పెట్టిన పోల్ వంటి ఏదైనా వస్తువు కింద నుంచి రోలర్ స్కేటింగ్ చేసే ఈ ఆటకు చాలా గుర్తింపు ఉంది. 20 కార్ల కింద నుంచి వేగంగా వెళ్తున్న చిన్నారి వీడియోను ట్విటర్‌లో షేర్ చేయగా, వైరల్ గా మారింది. ఏప్రిల్ 16న పుణెకు చెందిన దేశ్నా ఆదిత్య నాహర్ కేవలం 13.74 సెకన్ల లోనే 20 కార్ల కింద నుంచి లింబో స్కేట్ నిర్వహించింది. ఈ రికార్డు సాధించేందుకు దేశ్నా సుమారు ఏడాదిన్నర పాటు సాధనం చేసింది అని గిన్నిస్ వరల్డ్ రికార్డు తన అధికారిక ఖాతాలో రాసుకొచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News