Monday, December 23, 2024

మహోద్యమంలో మాతో కలవండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ధరిత్రిని రక్షించేందు కు సమిష్టిగా మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరూ కలిసిరావాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 22న ప్రారంభించనున్న ఏడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ‘మాతో చేరండి’ అంటూ ఎక్స్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. భారతదేశాన్ని హరితమయంగా మార్చేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో చేరాలని భూమిని చల్లగా తరువాయి 6లో
ఉంచేందుకు, జీవజాతుల ప్రాణాలను కాపాడేందుకు సమిష్టిగా మొక్కలు నాటేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని ఎక్స్ వేదికగా పిలుపు నిచ్చారు. వాతావరణ సమత్యులత, జీవజాతుల ప్రాణాలను రక్షించడంలో పచ్చదనం పాత్రను గుర్తించడంలో భాగంగా ‘హర హైతో భరా హై- గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఉద్యమం పుట్టిందని గుర్తుచేశారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం స్ఫూర్తితో వాతావరణ మార్పు, వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు మొక్కలు నాటి మానవాళికి మంచి భవిష్యత్తు అందించమే లక్ష్యంగా పచ్చ ధనానికి కృషిచేస్తున్నట్టు వెల్లడించారు.

ఏడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, మాజీ రాజ్యసభ సభ్యులు హీరో చిరంజీవి, నటుడు ప్రభాస్‌కు సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. మూడు మొక్కలతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రజల భాగస్వామ్యంతో ఆరేళ్లలో మహా ఉద్యమంగా మారింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కొద్ది సంవత్సరాల కాలంలోనే లక్షలాది మొక్కలను నాటి, వాటిని సంరక్షించడం జరిగింది. మొక్కలను నాటుతూ పచ్చదనాన్ని పెంచుతున్న ప్రకృతి ప్రేమికులు ప్రతి ఒక్కరికీ మాజీ ఎంపి సంతోష్ ధన్యవాదాలు తెలిపారు మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారం. పచ్చదనం పెంపు వల్ల పర్యావరణం పరిఢవిల్లడంతో పాటు భవిష్యత్తు తరాలకు ఇది ఎంతో ఉపయుక్తకరం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి బృహత్తర కార్యక్రమం ద్వారా ఆరేళ్లలో ఎంతో కృషి జరిగిందని, రానున్న ఏడవ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సైతం ప్రజలు అదే స్ఫూర్తితో కార్యక్రమంలో భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని

ఈ సందర్భంగా మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ మరోమారు పునరుద్ఘాటించారు. ఇదే క్రమంలో గతంలో మాదిరిగానే ప్రతి సందర్భంలోనూ ప్రతి ఒక్కరు తాము ఒక మొక్కను నాటడమే కాకుండా.. మరో ముగ్గురి ద్వారా మొక్కలు నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అనుక్షణం గుర్తించుకోవాలన్నారు. తాను ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటివరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములవ్వడంతో పాటు రానున్న ఏడవ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సైతం అదే స్ఫూర్తి కొనసాగించగలరన్న ఆశాభావాన్ని మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News