Thursday, January 23, 2025

కారులో అంతర్మథనం

- Advertisement -
- Advertisement -

సంచలనంగా మారిన కాంగ్రెస్‌లో ఆరుగురు ఎంఎల్‌సిల చేరిక

త్వరలో మరికొందరు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు పార్టీని వీడనున్నారని జోరుగా ప్రచారం
బిఆర్‌ఎస్ గ్రేటర్ నేతల భేటీకి 8మంది ఎంఎల్‌ఎలు, 17మంది కార్పొరేటర్లు డుమ్మా
వలసలకు చెక్ పెట్టడంపై అధిష్టానం ఫోకస్ అస్త్రంగా అనర్హత పిటిషన్లు

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఇతర నేతలు వరుసగా కాంగ్రెస్‌లో చేరుతుండటం పట్ల పార్టీలో అంతర్మథనం మొదలైంది. పార్టీలో ఉన్న కీలక నేతలుగా వ్యవహరించిన వారు అధికార కాంగ్రెస్ పార్టీలోకి నాన్ స్టాప్‌గా చేరుతూనే ఉన్నారు. సిఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఆరుగురు ఎంఎల్‌సి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు పార్టీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఎంఎల్‌సిలు దండె విఠల్, బసవరాజు సారయ్య, భానుప్రసాద్‌రావు, బుగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లే శం, ప్రభాకర్‌రావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా రు. త్వరలో మరో ఆరుగురు ఎంఎల్‌ఎలు, ఐదుగురు ఎంఎల్‌సిలు కాం గ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచా రం జరుగుతోంది. దీంతో పార్టీ లో అంతా అయోమయంగా మా రింది. పార్టీలో కొనసాగే వారెవ రో, వీడేవారెవరో ఎవరికీ అంతుచి క్కడం లేదు. అర్ధరాత్రి ఒకేసారి ఆరుగురు ఎం ఎల్‌సిల జంపింగ్ వ్యవహారం పార్టీలో సంచలనంగా మారింది.

తాజాగా తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నే తృత్వంలో నిర్వహించిన గ్రేటర్ బిఆర్‌ఎస్ నేతల సమావేశానికి ఏకంగా 8 మంది ఎంఎల్‌ఎలు, 17మంది కా ర్పొరేటర్లు డుమ్మా కొట్టడం కొత్త అ నేక అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి ఈ సమావేశానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నేతృత్వం వహిస్తారని తొలుత ప్రచా రం జరిగింది. అయితే కెటిఆర్, హరీశ్ రావులు ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్ విషయంలో సీనియర్ న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నారు. దీంతో తలసాని శ్రీనివాస్ యాద వ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం

కొనసాగింది. చేరిక లు ఇంతటితో ఆగలేదని త్వరలోనే మరికొంత మంది ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు తమతో చేతులు కలపడం ఖాయం అని కాంగ్రెస్ నేతలు చెబుతున్న వేళ గులాబీ అధిష్టా నం ఆహ్వానించిన సమావేశానికి సొంత పార్టీ ఎంఎల్‌ఎలు, కార్పొరేటర్లు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. దీంతో కారు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్ అయోమయంలో పడినట్లు తెలుస్తోంది.

వలసలపై సీరియస్
వలసలను బిఆర్‌ఎస్ అధిష్టానం సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు తెలిసింది. వలసలు పార్టీకి భారీ డ్యామెజీగా భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బిఆర్‌ఎస్ నేతలు వరుసగా ప్రెస్‌మీట్‌లు పెట్టి విమర్శలు చేస్తున్నారు. ఇటీవల పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేరిక సమయంలో బిఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ నేతృత్వంలో ఆయనను కలిసేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకుని కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే బిఆర్‌ఎస్ నేతల వలసలను చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం ఫోకస్ పెంచినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే వ్యూహాలను రచిస్తున్నట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపులను నివారించేందుకు బిఆర్‌ఎస్ పార్టీ అనర్హత పిటిషన్లు దాఖలు చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా ఎంఎల్‌ఎల వలసలకు అడ్డుకట్ట వేయాలని బిఆర్‌ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. చట్టపరంగా అనర్హత వేటు పడేలా చూడడం ద్వారా ఇతర శాసనసభ్యులు పార్టీని వీడకుండా కట్టడి చేయవచ్చని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అనర్హతా పిటిషన్లను మూడు నెలల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందని ఆ పార్టీ చెబుతోంది. దీంతోపాటు పార్టీని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించినట్లు తెలిసింది. ప్రస్తుతం సర్పంచ్‌లు, జెడ్‌పిలు, ఎంపిపిల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టం చేయడం ద్వారా కేడర్‌ను కాపాడుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News