Thursday, December 26, 2024

మణిపూర్‌లో విద్యార్థుల ర్యాలీలో హింస: పలువురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిజూర్ రాజధాని ఇంఫాల్‌లో ముఖ్యమంత్రి సచివాలయానికి సమీపంలోని మోయిరాంగ్‌ఖోమ్ వద్ద బుధవారం రాళ్లు రువ్వుతున్న మూకలను చెదరగొట్టేండుకు భద్రతా దళాలు బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు.

జులైలో అదృశ్యమైన ఇద్దరు యువకుల మృతదేహాలకు చెందిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వెలుగుచూసిన నేపథ్యంలో యువకుల అపహరణ, హత్యలను నిరసిస్తూ విద్యార్థులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. న్యాయం కావాలంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి బీరేన్ ఎన్ సింగ్ బంగళా వైపు వస్తుండగా భద్రతా దళాలు వారిని అడ్డుకున్నారు.

ఇద్దరు విద్యార్థులను హత్యచేసిన హంతకులను 24 అరెస్టు చేయాలని, విద్యార్థుల మృతదేహాలను దహన సంస్కారాల కోసం అప్పగించాలని విద్యార్థి నాయకుడు లాంతెన్‌బ డిమాండు చేశారు. తమ సస్యలను చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిని కలుసుకోవాలని భావిస్తున్నామని, తమ తోటి విద్యార్థులను చంపివేస్తుంటే తాము ఎలా చదువుకుంటామని ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులను శాంతింపచేయడానికి ప్రయత్నించారు. ముఖ్యమంత్రి, గవర్నర్ ఇద్దరితో సమావేశపరచడానికి విద్యార్థి ప్రతినిధులను పంపించేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే, పరిస్థితి హఠాత్తుగా అదుపు తప్పింది. కొందరు విద్యార్థులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు భద్రతా దళాలు బాష్పవాయు గోళాలు ప్రయగించాయని ఒక అధికారి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News