Monday, December 23, 2024

స్వర్ణాయలం వద్ద పేలుడు ..పలువురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం రాత్రి ఓ రెస్టారెంట్‌లో పేలుడు జరిగింది. స్వర్ణ దేవాలయం సమీపంలో ప్రధాన రాదారిలో ఉండే రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అయితే ఇది ఉగ్రవాదుల చర్య కాదని, ప్రమాదం అని పోలీసు అధికారులు తెలిపారు. ఒక్కసారి భారీ శబ్ధం విన్పించడంతో అర్థరాత్రి వరకూ ఇక్కడ తిరుగుతున్న

యాత్రికులు స్థానికులు ఇదేదో ఉగ్రవాద దాడి అని కొద్ది సేపు కంగారు పడ్డారు. తరువాత పరిస్థితి కుదుటపడింది. రెస్టారెంట్‌లోని చిమ్నిలో జరిగిన ప్రమాదంతోనే పేలుడుకు దారితీసి ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News