Saturday, December 21, 2024

విభజన సమస్యలకు 10 ఏళ్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగి మరికొన్ని రోజుల్లో పది సంవత్సరాలు పూర్తి కానున్నాయి. కానీ,ఆస్తుల విభజన, విద్యుత్ బిల్లుల బకాయిలు వంటి పలు సమస్య లు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మధ్య ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నా యి. మరొక వైపు హైదరాబాద్‌కు జూన్ 2 నుంచి ఉమ్మడి రాజధాని హోదా ముగియనున్నది. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం, హైదరాబాద్ ఇక తెలంగాణకే చెందుతుంది. అధికార వర్గాల స మాచారం ప్రకారం, రెండు రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన పూర్తి కాలేదు. పలు అంశాలపై ఏకాభిప్రాయం లేకపోవడమే అందుకు కారణం. ఎపి పునర్విభజన చట్టం ప్రకారం, 89 ప్ర భుత్వ కంపెనీలు, కార్పొరేషన్లను తొమ్మిదవ షెడ్యూల్‌లో పొందుపరిచారు. వాటి లో ఆం ధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసా య పారిశ్రామి క అభివృద్ధి కార్పొరేషన్,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. చట్టం పదవ షె డ్యూల్‌లో ఎపి రాష్ట్ర సహకార యూనియ న్, పర్యావరణ రక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ, ఎపి అటవీ అకాడమీ, సత్పరిపాలన కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 107 శిక్షణ సంస్థలు/ కేంద్రాలు ఉ న్నాయి. విశ్రాంత ప్రభుత్వ అధికారి షీలా భిడే సారథ్యంలోని నిపుణుల కమిటీ షె డ్యూల్ 9, 10 సంస్థల విభజనపై సిఫార్సు లు సమర్పించినా ఆ వ్యవహారం అపరిష్కృతంగానే ఉండిపోయింది. విభజన తరువా త విద్యుత్ తరువాయి 10లో
సరఫరాకు సంబంధించిన బకాయిల చెల్లింపుపై వివాదంలో రెండు రాష్ట్రాలు చిక్కుకున్నాయి. తుది పరిష్కారం కోసి నిరీక్షిస్తున్న అంశాలలో ఉద్యోగుల బదలీ ఒకటి. రాష్ట్ర విభజన సమయంలోఎపికి కేటాయించిన మిగులు (144 మంది) తెలంగాణ ఉద్యోగులను తిరిగి తెలంగాణకు రప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తాము శనివారం (18న) ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఒక వినతిపత్రం సమర్పించినట్లు తెలంగాణ ఎన్‌జిఇఒల యూనియన్ సెంట్రల్, హైదరాబాద్ అధ్యక్షుడు ఎం జగదీశ్వర్ ఆదివారం ‘పిటిఐ’తో చెప్పారు.

ఆ ఉద్యోగులు 2014 నుంచి ఎపిలో పని చేస్తున్నారు. మరొక ఉదాహరణ & ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్ రవాణా సంస్థ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం. హైదరాబాద్‌లోని కార్పొరేషన్ ఆస్తులలో వాటాను ఎపి కోరిందని, కాని టిఎస్‌ఆర్‌టిసి దానికి అంగీకరించలేదని టిఎస్‌ఆర్‌టిసి సీనియర్ అధికారి ఒకరు పిటిఐకి తెలిపారు. హెడ్‌క్వార్టర్స్‌కు షీలా భిడే కమిటీ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఆ ఆస్తులు తమకే చెందుతాయని టిఎస్‌ఆర్‌టిసి భావిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదలీ, పునరావాసం సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించవలసిందని అధికారులను ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య రాజీ ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఇతర పెండింగ్ వ్యవహారాల్లో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించే విధంగా వ్యవహరించాలని అధికారులతో ఆయన చెప్పారు. ఇతర విషయాలతో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ఇతర సంబంధిత వ్యవహారాలను చర్చించేందుకు శనివారం (18న) రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది.

అయితే, లోక్‌సభ ఎన్నికలకు ప్రవర్తన నియమావళి దృష్టా ఎన్నికల కమిషన్ (ఇసి) నుంచి రావలసిన అనుమతి శనివారం రాత్రి వరకు రానందున క్యాబినెట్ సమావేశం నిర్వహించలేకపోయారు. ఇసి అనుమతి పొందిన తరువాత క్యాబినెట్ సమావేశం నిర్వహణకు సిఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు నిర్ణయించారు. పూర్వపు యుపిఎ హయాంలో 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్‌లోఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఆమోదించడంతో తెలంగాణ 2014 జూన్ 2న ఉనికిలోకి వచ్చినప్పుడు దశాబ్దాల తరబడి సాగిన డిమాండ్ నెరవేరింది. 2014 జూన్ 2 నుంచి పది సంవత్సరాల కాలానికి రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను చేశారు. ఎపి పునర్విభజన చట్టం ప్రకారం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం 2024 జూన్ 2 నుంచి తెలంగాణకే రాజధానిగా ఉంటుంది. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు 2024 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధాని అయినప్పటికీ టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు ఎపి ముఖ్యమంత్రి అయినప్పుడు 2016లో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయాన్ని, దాదాపు మొత్తం రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని ఎపిలోని అమరావతికి మార్చారు.

అమరావతిని పర్యావరణ హిత ప్రపంచ శ్రేణి రాజధానిగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు. హైదరాబాద్‌లోని లేక్ వ్యూ ప్రభుత్వ గెస్ట్ హౌస్ వంటి భనవాలను జూన్ 2 తరువాత స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర విభజన సమస్యలపై ఈ నెల 15న నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులతో చెప్పారు. లేక్ వ్యూ ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ను పది సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్‌కు ఇవ్వడమైంది. కాగా, ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్‌పై వివాదాన్ని గత మార్చిలో పరిష్కరించడమైంది. ఆ స్థలాన్ని రెండు రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. విభజన సమస్యలపై మార్చిలో దేశ రాజధానిలో రెండు రాష్ట్రాల సీనియర్ అధికారులతో కేంద్రం ఒక సమావేశం నిర్వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News