- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని పొగ మంచు వణికిస్తోంది. ఢిల్లీ నగరమంతా దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు విమానాలు నిలిచిపోయాయి.
కొన్ని విమానాలు ఆలస్యంగా బయల్దేరనున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంటలపాటు విమానాలు కదలకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా విజిబులిటీ సరిగా లేకపోవడంతో పలు రైళ్ల రాకపోకలు కూడా ఆలస్యంగా కొనసాగుతున్నాయి.
- Advertisement -