Friday, November 22, 2024

తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

Several special trains over Telugu states

హైదరాబాద్: పండుగ సీజన్‌లో ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. హైదరాబాద్ -టు గోరఖ్‌పూర్ మధ్య ప్రత్యేక రైలు (నెం.02575) హైదరాబాద్ నుంచి నవంబరు 5న(శుక్రవారం) రాత్రి 9.05 గం.లకు బయలుదేరి ఆదివారం ఉదయం 6.30 గం.లకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. అలాగే మరో ప్రత్యేక రైలు (నెం.02576) గోరఖ్‌పూర్ నుంచి నవంబరు 7న(ఆదివారం) ఉదయం 8.30 గం.లకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 03.20 గం.లకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. పూర్తిగా రిజర్వేషన్ చేసిన ప్రయాణికులు మాత్రం ఈ రైళ్లను ఎక్కేందుకు వీలుంటుంది.

వాస్కోడిగామ -టు జసిదిల మధ్య ప్రత్యేక రైలు

అలాగే వాస్కోడిగామ -టు జసిది మధ్య రైల్వే శాఖ ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనుంది. వాస్కోడిగామా నుంచి జసిదికి నవంబర్ 5 నుంచి జనవరి 28 వరకు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే నడపనుంది. ఈ ప్రత్యేక రైలు(నెం.06397) వాస్కోడి గామలో ప్రతి శుక్రవారం ఉదయం 05.15 గం.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07 గం.లకు జసిదికి చేరుకుంటుంది. అలాగే జసిది నుంచి వాస్కోడి గామకు నవంబర్ 8 నుంచి జనవరి 31 వరకు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతి సోమవారం 1.10 గం.లకు జసిదిలో బయలుదేరనున్న ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 2.40 గం.లకు వాస్కోడిగామకు చేరుకుంటుంది.

వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్‌లలో…

ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ మడ్గావ్, క్యాస్టిల్ రాక్, లోండా, ధార్వాడ్, హుబ్లీ, గదగ్, కొప్పల్, హాస్పేట, తోరణగల్లు, బళ్లారి, గుంతకల్లు, రాయచూరు, వికారాబాద్, సికింద్రాబాద్, ఖాజీపేట్, మం చిర్యాల, బాలార్ష, రాయ్‌పూర్, బిలాస్పూర్, రూర్కెలా, హతియా, రాంచీ, చంద్రా పూర్, ధనబాద్, చిత్తరంజన, మధుపూర్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

కొన్ని రైళ్లు రద్దు.. గమ్య స్థానాల్లో మార్పు..

ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే వివిధ కారణాలతో మరికొన్ని రైళ్లను రద్దు చేయగా కొన్ని రైళ్లు బయలుదేరే రైల్వే స్టేషన్లు గమ్య స్థానాల్లో మార్పులు చేసింది. ఆ వివరాలను దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది.

దేశంలో మొత్తం 668 ఫెస్టివల్ స్పెషల్ సర్వీసులు

పండుగల సీజన్ నేపథ్యంలో భారత రైల్వే శాఖ 110 రైళ్లతో మొత్తం 668 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాల మీదుగా ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News