Wednesday, January 22, 2025

విజయవాడ డివిజన్‌లో భారీగా రైళ్లు రద్దు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: విజయవాడ డివిజన్‌లో భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ట్రైన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల కారణంగా పలు ట్రైన్లను రద్దు చేసిన అధికారులు.. మరికొన్నింటిని దారిమళ్లించారు. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాలు కొనసాగించాలని రైల్వే అధికారులు సూచించారు.

రద్దయిన ట్రైన్ల వివరాలు..

  • గుంటూరు-రాయగడ (17243/17244 ) 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు
  • గుంటూరు-విశాఖపట్నం (17239/17240) ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు
  • విజయవాడ-బిట్రగుంట (07977/07978) ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు
  • మచిలీపట్నం-విశాఖపట్నం (17219/17220) 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు
  • విజయవాడ రామవరప్పాడు మధ్య ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు ట్రైన్లు పాక్షికంగా రద్దు చేశారు.

దారి మళ్లింపు (వయా విజయవాడ, భీమవరం, నిడదవోలు)

  • టాటా- యశ్వంత్‌పూర్‌(18111) ఫిబ్రవరి 1, 8, 15, 22 తేదీల్లో
  • టాటా-బెంగళూరు(12889) ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో
  • యర్నాకుళం-పాట్నా(22643) ఈ నెల 29, ఫిబ్రవరి 5, 12, 19 తేదీల్లో
  • హతియా-బెంగళూరు(22837) ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో
  • హతియా-బెంగళూరు(12835) ఈ నెల 30, ఫిబ్రవరి 4, 6, 11, 13, 18, 20, 25 తేదీల్లో
  • భావనగర్‌-కాకినాడపోర్ట్‌ (12756) ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో
  • బెంగళూరు-గౌహతి(12509) ఈ నెల 31, ఫిబ్రవరి 2, 7, 9, 14, 16, 21, 23 తేదీల్లో
  • ఛత్రపతి శివాజీ టెర్మినస్‌-భువనశ్వర్‌ (11019) ఈ నెల 29, 31 ఫిబ్రవరి 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17, 19, 21, 23, 24 తేదీల్లో
  • ధన్‌బాద్‌-అల్లపూజ(13351) ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25వరకు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News