- Advertisement -
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఫ్యాక్ట్ షీట్
న్యూఢిల్లీ : వ్యాక్సిన్ల వల్ల కొందరిలో దుష్ఫలితాలు ఏర్పడుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఎవరెవరు కోవీషీల్డ్ తీసుకోవద్దో సూచిస్తూ ఫ్యాక్ట్‌షీట్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) విడుదల చేసింది. తీవ్ర అలర్జీ సమస్యలు ఉన్నవారితోపాటు కొన్ని రసాయనాలు పడనివారు, మొదటి డోస్ వల్ల దుష్ఫలితాలు ఎదురైనవారు కోవీషీల్డ్ తీసుకోవద్దంటూ ఎస్‌ఐఐ సూచించింది. కోవీషీల్డ్‌లోని రసాయనాల జాబితా ఇలా ఉన్నది.. ఎల్‌హిస్టిడిన్, ఎల్‌హిస్టిడిన్ హైడ్రోక్లోరైడ్ మోనోహైడ్రేట్, మెగ్నీషియం క్లోరైడ్ హెక్సాహైడ్రేట్, పోలీసోర్బేట్ 80, ఇథనాల్, సూక్రోజ్, సోడియంక్లోరైడ్, డైసోడియం ఎడెటేట్ డైహైడ్రేట్(ఇడిటిఎ), నీరు.. ఈ రసాయనాలతో కూడిన మందులు పడనివారు కోవీషీల్డ్ తీసుకోకుండా ఉండాలని ఎస్‌ఐఐ తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నది.
- Advertisement -