Saturday, December 21, 2024

దీర్ఘకాల కొవిడ్‌తో తీవ్ర సమస్యలు

- Advertisement -
- Advertisement -

Severe chronic problems with Covid-19

న్యూఢిల్లీ : దీర్ఘకాల కొవిడ్‌తో బాధపడుత్నువారు ఎంతమందో ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా 10 నుంచి 20 శాతం మంది కరోనా బాధితుల్లో వైరస్ నుంచి కోలుకున్న తరువాత కూడా దీర్ఘకాలం కొవిడ్ ప్రభావం ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) వెల్లడించింది. ముఖ్యంగా 25 50 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఈ లాంగ్ కొవిడ్ బారిన పడుతున్నారని గుజరాత్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాకేశ్ పండిత్ తెలిపారు. గరిష్ఠంగా ఆరు నెలల పాటు ఈ సమస్య వేధించొచ్చని చెబుతున్నారు. కొవిడ్ సమయంలో వెంటిలేటర్ సాయం తీసుకున్నవారిలో ఇప్పుడు ఊపిరితిత్తులు తీద్రంగా దెబ్బతిన్నాయి. నాడీ వ్యవస్థ , కిడ్నీలు, జీర్ణాశయ పేగులపైనా ఈ లాంగ్ కొవిడ్ తీవ్ర ప్రభావం చూపిస్తోందని చెప్పారు.

దీర్ఘకాల కొవిడ్ బారిన పడిన వారిలో అత్యంత తీవ్రమైన లక్షణం శ్వాసకోశ సమస్య అని వైద్యులు చెబుతున్నారు. దీంతోపాటు కండరాలు బలహీనంగా ఉండటం, మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గటం, జుట్టు ఊడటం, కంటిచూపు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటున్నట్టు తెలిపారు. కొంతమంది 15 20 కిలోల వరకు బరువు తగ్గినట్టు రాకేశ్ పండిత్ తెలిపారు. గుండె చప్పుడు పెరగడం, ఒత్తిడి, ఆందోళన , నిల్చున్నప్పుడు కళ్లు తిరగడం వంటి సమస్యలు కూడా ఉంటున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు దీర్ఘకాల కొవిడ్‌కు ప్రత్యేక చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే పెయిన్ కిల్లర్లు, మల్టీ విటమిన్లతోపాటు , ఫిజికల్ థెరపీ, యోగా, వంటి వాటితో ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. లాంగ్ కొవిడ్ సమస్య ఎదుర్కొంటున్నవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు డైట్ పాటించాలని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News