Friday, November 22, 2024

చలి పిడికిలిలో వాయువ్యభారతం

- Advertisement -
- Advertisement -

Severe cold waves in Northwest India

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం
ఏడు నగరాల్లో మైనస్‌కు చేరిన కనిష్ఠ ఉష్ణోగ్రత
మంగళవారం వరకూ కొనసాగనున్న తీవ్రశీతల గాలులు

న్యూఢిల్లీ : వాయువ్యభారతం చలిగాలులతో గజగజలాడుతోంది. రానున్న మూడు రోజుల పాటు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని, ఆ తరువాత కాస్త తగ్గవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్ లోని అనేక నగరాలులో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యధిక హిమపాతం కారణంగా గత 24 గంటల్లో ఏడు నగరాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్‌కు చేరింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లతోపాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్, గిల్గిత్‌బాల్టిస్థాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్ లలో గత కొద్ది రోజులుగా తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ఆదివారం రాజస్థాన్ లోని చురులో 2.6, గంగానగర్‌లో 3.5 , నార్నాల్‌లో 1.2, హిసార్‌లో 2 సఫ్దర్‌జంగ్ (ఢిల్లీ)లో 4.6 డిగ్రీలు నమోదు కాగా, సికార్‌లో మైనస్ 2.5 డిగ్రీలు, అమృత్‌సర్‌లో మైనస్ 0.5 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఢిల్లీలో సాధారణం కన్నా మూడు పాయింట్లు తక్కువగా కనీస ఉష్ణోగ్రత 4.6 డిగ్రీలుగా నమోదైనట్టు సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ వెల్లడించింది. లోధీ రోడ్ వద్దనున్న వాతావరణ కేంద్రం 3.6 డిగ్రీలు కనిష్ఠ ఉష్ణోగ్రతగా నమోదు చేసింది. జైపూర్ లోని జాబర్న్ పట్టణంలో ఇప్పటివరకు ఉన్న కనీస ఉష్ణోగ్రత రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఆదివారం నగరంలో తొలిసారిగా ఉష్ణోగ్రత మైనస్ 5 డిగ్రీలకు చేరింది. శ్రీకరణ్ నరేంద్ర అగ్రికల్చర్ యూనివర్శిటీ లోని వాతావరణ అబ్జర్వేటరీ లోని ఓపెన్ పాన్‌లో నీరంతా గడ్డకట్టుకు పోయింది.రానున్న రెండు రోజుల్లో ఉత్తరాఖండ్‌లో కొన్ని ప్రాంతాల్లో , 23, 24 తేదీల్లో పంజాబ్, హర్యానాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని సూచించింది.

శీతల, పొడి వాయువ్యగాలులు గంటకు 15 కిమీ వేగంతో వీస్తాయని, వాయువ్యభారతం లోని మైదాన ప్రాంతాల్లోనూ మంగళవారం వరకు కొనసాగుతాయని వివరించింది. 50 మీటర్ల కన్నా మించి చాలా దట్టంగా, 200 మీటర్ల నుంచి 51 మీటర్ల లోపు దట్టంగా, 201 నుంచి 500 మీటర్ల దూరం ఓ మోస్తరుగా, 500 నుంచి 1000 మీటర్ల వరకు మసకగా పొగమంచు ఆవరిస్తుందని పేర్కొంది. కనీస ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా ఉంటే తీవ్రమైన చలిగాలులు ఏర్పడతాయని, అలాగే 10 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా, లేదా సమానంగా కనీస ఉష్ణోగ్రత ఉన్నా, సాధారణ ఉష్ణోగ్రత కన్నా గరిష్ఠ ఉష్ణోగ్రత కనీసం 4.5 డిగ్రీల సెల్సియస్ ఉన్నా అతిశీతల దినంగా పరిగణించాలని వాతావరణ శాఖ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News