Saturday, November 16, 2024

వాట్సాప్, ఫేస్‌బుక్ ఇన్‌స్టాలకు తీవ్ర అంతరాయం

- Advertisement -
- Advertisement -

Severe disruption to WhatsApp and Facebook instagram

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలలో సోమవారం వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు పనిచేయలేదు. దీనితో వీటిపై ఎంతగానో ఆధారపడే కోట్లాది మంది సామాజిక మాధ్యమదార్లు కంగుతిన్నారు. తమ గోడు అతికష్టం మీద తెలియచేసుకున్నారు. అత్యంత ప్రాచుర్యపు, ప్రపంచవ్యాప్త వాడకపు ఈ మూడు యాప్‌లు ఫేస్‌బుక్ సారధ్యంలోనే పనిచేస్తున్నాయి. జరిగిన మొరాయింపు పరిణామంపై ఫేస్‌బుక్ ఇతరత్రా వేదిక అయిన ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘సారీ ..ఏదో తప్పు జరిగింది. ఏమి జరిగిందనేది కనుగొంటున్నాం. తొందరలోనే అంతా సరిదిద్దుతాం. సాధ్యమైనంత త్వరితగతిన పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌లో తెలియచేసుకుంది. ఇది సాంకేతిక లోపం అనుకుంటున్నామని వివరణ ఇచ్చుకుంది.

వాట్సాప్, ఫేస్‌బుక్ పనిచేయడం లేదనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా సంస్థ నిర్థారించింది. ఎప్పుడూ వాట్సాప్ మిస్సెజ్‌లు, ఫేస్‌బుక్ అనుసంధానంతో గడిపే యుజర్లు ట్విట్టర్‌కు దిగారు. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల నుంచి తమ పోస్టింగ్‌లు వెలుగుచూడటం లేదని, ఈ సమాచార వేదికలపై నుంచి తమ స్పందనలు క్లిక్ కావడం లేదని ఎందుకో తెలియడం లేదని వాపొయ్యారు. ఇక వెబ్ సేవల లోపాలను ఎప్పటికప్పుడు పనికట్టే సంస్థ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ . కామ్ ఈ అంశంపై స్పందించింది. తమకు క్షణక్షణానికి వాట్సాప్ బంద్ గురించి ఫిర్యాదులు అందుతున్నాయని, ఏమైందనేది కనుగొంటున్నామని తెలిపింది. ట్విట్టర్ ఇతర సామాజిక మాద్యమాల విషయంలో ఇండియాలో వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు అత్యంత జనాదరణ ఉంది. మారుమూల గ్రామీణ ప్రాంతాలవరకూ విస్తరించుకుంది. తక్షణ సందేశం దేశఖండాంతరాలకు సచిత్రంగా పంపించేందుకు ఈ వేదికలు అనువైనవిగా మారాయి. సోషల్ మీడియాలో ఆయువుపట్టు అయి కూర్చున్నాయి. భారతదేశంలో ఫేస్‌బుక్ యుజర్ల సంఖ్య 41 కోట్లు దాటింది. వాట్సాప్ వినియోగదార్లు అత్యధిక సంఖ్యలో 53 కోట్లు దాటారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదార్ల సంఖ్య 21 కోట్లు దాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News