- Advertisement -
టోక్యో: జపాన్ ఈశాన్య తీరంలో శనివారం రాత్రి తీవ్ర భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. సముద్రంలో 60 కిమీ లోతులో భూప్రకంపనలు కేంద్రీకృతం అయినట్టు వివరించింది. ఫుకుషిమా, మియాగీ, తదితర ప్రాంతాల్లో భూకంపం కనిపించిందని తెలిపింది. రిక్టర్ స్కేలుపై 7.1 స్థాయి సూచించింది. ఫుకుషిమా డై ఇచి అణువిద్యుత్ ప్లాంట్ లో ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా అని పరిశీలిస్తున్నారు. ఇతర కేంద్రాల్లో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నట్టు ఫిర్యాదులు ఇంతవరకు రాలేదు.
- Advertisement -