Thursday, November 14, 2024

ఢిల్లీలో తీవ్ర భూ ప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం తీవ్ర భూ ప్రకంపనలు సంభవించాయి. పొరుగున ఉన్న నేపాల్‌లో వరుసగా భూకంపాలు సంభవించాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాల్లో కొద్ది సేపు భూమి బలంగా కంపించింది. ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఉత్తర భారత దేశం లోని పలు చోట్ల ఈ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్ లోని లఖ్‌నవూ, హాపుర్, అమ్రోహా, ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. మధ్యాహ్నం 2.25 ప్రాంతంలో తొలిసారి భూ ప్రకంపనలను నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ గుర్తించింది. తొలుత అది 4.6 తీవ్రతతో రికార్డయింది. పది కిలో మీటర్లు లోతులో అది కేంద్రీకృతమైనట్టు ఎన్‌సీఎస్ పేర్కొంది. ఇది గుర్తించిన అరగంట లోపే అంతకంటే ఎక్కువగా 6.2 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఇది భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్టు ఎన్‌సీఎస్ గుర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News