Monday, December 23, 2024

ముంగిట్లో మాంద్యం

- Advertisement -
- Advertisement -

అమెరికాతో పాటుగా ప్రపంచ దేశాలన్నిటిపైనా తీవ్ర ప్రభావం
2023 చివరి దాకా కొనసాగే ప్రమాదం ప్రముఖ ఆర్థికవేత్త నౌరీల్ రౌబినీ అంచనా

వాషింగ్టన్: ఈ ఏడాది చివర్లో అమెరికాతో స హా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాం ద్యం తప్పదని ప్రముఖ ఆర్థికవేత్త నౌరీల్ రౌబి నీ అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ ఆర్థిక మాంద్యం ప్రభావం దీర్ఘకాలం అంటే 2023 చివరి దాకా కొనసాగే అవకాశం ఉందని రౌ బిని మ్యాక్రో అసోసియేట్స్ సిఇఓ అయిన ఆ యన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో హెచ్చరించారు. 2008లో అమెరికా రియల్ ఎస్టేట్‌లో ఏర్పడిన సంక్షోభం కారణంగా ఆర్థి క మాంద్యం రావచ్చని రౌబినీ అప్పట్లో ముం దుగానే కరెక్ట్‌గా అంచనా వేశారు. దీంతో ఆ యనకు ‘డాక్టర్ డూమ్’ అన్న నిక్‌నేమ్ కూడా వచ్చింది. కాగా తాజా ఆర్థిక మాంద్యంలో అమెరికా ప్రధాన మార్కెట్ సూచీ అయిన ఎస్‌అండ్‌పి 500 సూచీ దాదాపు 40శాతం కా పడిపోవచ్చని కూడా ఆయన అంచనా వే శారు. భారీగా పెరిగిపోయిన కార్పొరేట్ సం స్థలు, ప్రభుత్వాల అప్పుల నిష్పత్తిని చూస్తే ఈ విషయం ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుందని ఆయన అంటున్నారు. వడ్డీ రేట్లు పెరిగి, రుణ సేవల ఖర్చులు పెరిగిపోయినప్పుడు కే వలం ప్రాణం మాత్రమే ఉండి నిస్తేజంగా మారిన చాలా సంస్థలు, కుటుంబాలు, కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు, షాడో బ్యాంకులు అంతేకాదు దేశాలు సైతం కుప్పకూలి పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

బుల్, బేర్ మార్కెట్లు, ప్రపంచ రుణ స్థాయిల కారణంగా స్టాక్స్ భారీగా పతనమవుతాయని హెచ్చరించిన ఆయన కఠినమైన చర్యలు లేకుండా ద్ర వ్యోల్బణం రేటును 2 శాతానికి పరిమితం చేయడం అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు దాదాపుగా అసాధ్యమని స్పష్టం చేశారు. అయితే వేతనాలు, సేవల రంగంలో ద్రవ్యోల్బణం కొ నసాగడం వల్ల వడ్డీ రేట్లను పెంచడం తప్ప ఫెడ్ రిజర్వ్‌కు వేరే మార్గం లేదని కూడా ఆ యన స్పష్టం చేశారు. తాజాగా 75 బేససిస్ పాయింట్లు వడ్డీ రేటు పెంచిన ఫెడ్ రిజర్వ్ నవంబర్, డిసెంబర్ నెలల్లో మరో 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే ఈ ఏడాది చివరికి ఫెడ్ ఫండ్స్ రేటు 4 శాతంనుంచి 4.25 శాతం మధ్య ఉంటుంది. వీటికి తోడు, కొవిడ్ మహమ్మారి, రష్యాఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ విషయంలో చైనా అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానం లాం టి పరిణామాల కారణంగా సరఫరాల రం గంలో ఎదురవుతున్న నెగెటివ్ పరిణామాల కారణంగా ఖర్చులు పెరిగిపోయి ఆర్థిక వృద్ధి మందగించి పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఫెడ్ రిజర్వ్ లక్షం నెరవేరడం కష్టమని రౌ బిని అభిప్రాయపడ్డారు.

ఒకసారి ప్రపంచ దే శాలు మాంద్యంలోకి జారుకున్న తర్వాత ప్రభుత్వాలు ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించే అవకాశాలు కూడా లేవని, ఎందుకంటే చాలా దేశాలు ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకు పోయి ఉన్నాయని ఆయన అంటున్నారు. అ ధిక ద్రవ్యోల్బణం ఉంటే ‘ఒక వేళ మీరు ఉద్దీపనలు అమలు చేస్తే అది మొత్తం డిమాండ్‌ను ఓవర్‌హీటింగ్ చేయడమే అవుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఫలితంగా 1970లో మాదిరిగా స్తబ్దత నెలకొనడంతో పాటుగా ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో తలెత్తినట్లుగా తీ వ్రమైన రుణ సంక్షోభం నెలకొంటుందని కూ డా ఇది స్వల్పకాలిక మాం ద్యంగా ఉండబోదని, దారుణమై న మాంద్యంగా ఉంటుందన్నారు. ఈ ఆర్థిక మాంద్యం 2023 అంతా అవకాశాలున్నాయని, సరఫరాల సమస్యలు ఆర్థిక సం క్షోభం ఎంత తీవ్రంగా ఉంటాయనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News