Monday, December 23, 2024

భారత్‌లో కొనసాగుతున్న ఉష్ణోగ్రత

- Advertisement -
- Advertisement -
Heat
మరో 5రోజులు ఇలాగే కొనసాగింపు

న్యూఢిల్లీ: భారత్‌లో ఇప్పుడున్న ఉష్ణోగ్రత మరో ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండి) తెలిపింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌ను తాకుతోంది. వాయువ్య భారతంలో మరో ఐదు రోజులపాటు ఉష్ణోగ్రత వాతావరణం కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ నిపుణులు ఈ విషయాన్ని తెలిపినట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది. వాయువ్య భారతంలో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌ను కూడా తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News