Sunday, December 22, 2024

విద్యుత్ సంస్థల్లో బిసి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం

- Advertisement -
- Advertisement -

డైరెక్టర్ పోస్టులలో 50 శాతం బిసిలకు రిజర్వేషన్ కల్పించాలి : ఎంపి ఆర్‌కృష్ణయ్య

మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో బిసి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు , రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 సంవత్సరాలుగా పెంచారని, ఆవిధంగా చూసినట్లయితే డైరెక్టర్ పోస్టులకు గరిష్ట వయస్సు పరిమితిని 62 నుండి 65 సంవత్సరాలకు పెంచవలసి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు విద్యుత్ సంస్థల్లో బిసి, ఓసి ఉద్యోగులు చీఫ్ ఇంజనీర్ స్థాయి పదోన్నతి పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పదోన్నతుల్లో ఎస్సి,ఎస్టి ఉద్యోగులకు కల్పిస్తున్న రిజర్వేషన్లను లోపభూయిష్టంగా అమలు చేసినట్లు ఆయన ఆరోపించారు.

హైకోర్టు, సుప్రీంకోర్టుల ఉత్తర్వుల ప్రకారం 2019లో తెలంగాణ ప్రభుత్వము విద్యుత్ సంస్థల్లో 2014 నుండి కల్పించిన అన్ని పదోన్నతులను సమీక్షించి బిసి, ఓసి ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆదేశించినప్పటికీ, అట్టి ఉత్తర్వులు నేటికీ అమల్లోకి నోచుకోలేదన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కో ,ఎస్‌పిడిసిఎల్‌లలో డైరక్టర్ పోస్టుల భర్తీకోసం ప్రకటలను జారీ చేశారన్నారు.ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో చీప్ జనరల్ మేనేజర్, చీఫ్ ఇంజనీర్ స్థాయి పోస్టుల్లో ఎస్సి,ఎస్టి, ఉద్యోగులు సుమారుగా 30 మంది అర్హత కలిగి ఉన్నారని తెలిపారు. గరిష్ట వయసు పరిమితిని 65కు పెంచకుండా డైరెక్టర్ ఉద్యోగుల డైరెక్టర్ పోస్టులను నియమించినట్లయితే బిసి, ఒసిలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, అందుకే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెంటనే స్పందించి డైరెక్టర్ పోస్టుల భర్తీలో గరిష్ట వయస్సును 62 నుంచి 65కు పించి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో జాతీయ బీసీ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, తెలంగాణ విద్యుత్ సంక్షేమ సంఘం నుండి కోడెపాక కుమార్ స్వామి రాష్ట్ర అధ్యక్షులు, ముత్యం వెంకన్న గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీ బ్రహ్మేంద్రరావు, పి యాదగిరి, డాక్టర్ చంద్రుడు, విద్యుత్ ఓసి సంఘం అధ్యకులు ఆర్. సుధాకర్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి సి. బాను ప్రకాష్, మారం శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, వేణు తదితర నాయకులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News