- Advertisement -
హూస్టన్: భారత-అమెరికన్ల స్వచ్ఛంద సంస్థ సేవా ఇంటర్నేషనల్ భారత్‌లోని కొవిడ్ పేషెంట్ల కోసం 2184 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లను పంపింది. అమెరికా కాలమానం ప్రకారం అట్లాంటా నుంచి వీటిని మోసుకువచ్చే విమానం గురువారం బయలుదేరింది. యునైటెడ్ పార్సెల్ సర్వీస్(యుపిఎస్) కార్గో విమానం ద్వారా వాటిని పంపిస్తున్నట్టు సేవా సంస్థ తెలిపింది. యుపిఎస్ తన కార్గో సేవల్ని తమకు ఉచితంగా అందించిందని సేవా పేర్కొన్నది. భారత్‌లోని కొవిడ్ పేషెంట్ల కోసం 80 లక్షల డాలర్ల నిధులు సేకరించినట్టు తెలిపింది. మొదటి విడతగా ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు పంపిస్తున్నట్టు తెలిపింది. తమ సంస్థ కార్యకర్తలు అమెరికాతోపాటు భారత్‌లో పని చేస్తున్నారని తెలిపింది. భారతీయ అమెరికన్ల నుంచి నిధులు సేకరించామని తెలిపింది.
- Advertisement -