- Advertisement -
హరారే : జింబాబ్వే ఉపాధ్యక్షుడు 71 ఏళ్ల కెంటో మొహదీపై రాసలీలల ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని కట్టుకధలుగా ఆయన తోసిపుచ్చారు. అంతేకాదు తన పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించారు. రాజకీయ వికృతానికి తనను బలిపశువును చేయడానికి ఇదో ప్రయత్నంగా ఆయన ధ్వజమెత్తారు. మొహది మహిళలతో సాగించిన సంభాషణలతో కూడిన మూడుఆడియో టేపులను జిమ్‌లైవ్ అనే ఆన్‌లైన్ పబ్లికేషన్ బయటపెట్టింది. తన కార్యాలయంలో పనిచేసే ఇంటెలిజెన్స్ అధికారి సహా అనేక మంది మహిళలను లైంగికంగా లోబర్చుకునేలా వ్యవహరించారని ఆ ఆన్‌లైన్ పబ్లికేషన్ ఆరోపించింది.
- Advertisement -