Sunday, December 22, 2024

షెల్టర్ హోమ్ నుంచి పరారైన బాలికపై లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

 

తిరువనంతపురం : తిరువనంతపురం లోని నిర్భయ షెల్టర్ హోమ్‌లో ఆశ్రయం నుంచి పరారైన బాలికను పోలీస్‌ల పేరుతో భయపెట్టి ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇద్దరు నిందితులను పోలీస్‌లు తరువాత అరెస్టు చేశారు. వీరిపై పోక్సో చట్టంతోపాటు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత శుక్రవారం షెల్టర్ హోమ్ నుంచి పరారైన ఈ బాలిక ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో ఉండగా ఇద్దరు నిందితులు ఆమెను తాము పోలీసుల మని భయపెట్టి ఒక లాడ్జివద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వారు అరెస్టయ్యారు. నిందితుల్లో ఒకరు తిరువనంతపురం లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి సమీపంలో ఉన్న లాడ్జిని నిర్వహిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. మరో నిందితుడు పుత్తినపాలెంకు చెందిన విష్ణుగా గుర్తించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News