హైదరాబాద్: తెలంగాణలో మహిళలపై లైంగిక నేరాలు 202021 నుంచి 17 శాతం పెరిగాయి. కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు డేటాను వెల్లడించింది. మహిళలపై లైంగిక దాడులు తెలంగాణలో 2019లో 18394, 2020లో 17791, 2021లో 20865 గా నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన లైంగిక దాడులు చూసినట్లయితే 2019లో 105326, 2020లో 371503, 2021లో 428278 కేసులు నమోదయ్యాయి. మహిళల భద్రత, రక్షణకు అనేక చర్యలు తీసుకున్నారు. లైంగిక నేరాల దర్యాప్తు ట్రాకింగ్ సిస్టంను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసిందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. లైంగిక దాడులు చేసే వారి డేటాబేస్(ఎన్‌డిఎస్‌ఓ)ను కూడా ఏర్పాటుచేశారు.
201617 నుంచి 202122 వరకు నిర్భయ నిధులలో 16 శాతం నిధులను ఉపయోగించడంలో కూడా తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తెలంగాణకు కేంద్రం రూ. 238.06 కోట్లు విడుదల చేసిందని, కానీ రాష్ట్రం మాత్రం రూ. 200.95 కోట్లు మాత్రమే ఉపయోగించిందని పేర్కొంది. మహిళల రక్షణ, భద్రత లక్షం కోసం ఈ నిధిని ఏర్పాటు చేశారు.