Monday, December 23, 2024

లైంగిక వేధింపుల కేసు.. బాధిత మహిళకు రూ.9900 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికాకు చెందిన ఓ మహిళపై మాజీ భాగస్వామి లైంగిక వేధింపుల కేసులో ప్రత్యేక న్యాయమూర్తుల బృందం బాధిత మహిళకు 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9900 కోట్లు ) చెల్లించాలని ఆదేశించింది. బాధితురాలు 2016 నుంచి మార్కెస్ జమాల్ జాక్సన్ అనే వ్యక్తితో కలిసి జీవించింది. షికాగోలో కొంతకాలం గడిపిన తరువాత 2021 అక్టోబర్ లో పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడిపోయారు. అక్కడ నుంచి అతడి వేధింపులు మొదలయ్యాయి. గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలను శృంగార సైట్లలో పెట్టాడు. ఆమె ఇంట్లోని సీసీ కెమెరాలు , మొబైల్,ఈ మెయిల్ నుంచి వ్యక్తిగత ఫోటోలను సేకరించి,

ఆమె అనుమతి లేకుండా సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను సృష్టించి అందులో పోస్టు చేశాడు. ఈ చేష్టలతో విసుగెత్తిన బాధితురాలు 2022 ఏప్రిల్‌లో టెక్సాస్ లోని హ్యారీస్ కౌంటీ సివిల్ కోర్టులో దావా వేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న జ్యూరీ మహిళను మానసికంగా వేధించినందుకు 200 మిలియన్ డాలర్లతోపాటు ఆమెకు నష్టాన్ని కలిగించినందుకు శిక్షగా మరో బిలియన్ డాలర్లు (సుమారు రూ.8300 కోట్లు ) చెల్లించాలని తీర్పు వెలువరించింది. అమెరికా లోని అనేక రాష్ట్రాల్లో ఓ వ్యక్తి అంగీకారం లేకుండా వారి వ్యక్తిగత (మాజీ భాగస్వామి) ఫోటోలు , వీడియోలు ఇంటర్నెట్‌లో షేర్ చేయడం నేరం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News