Friday, January 3, 2025

లైంగిక వేధింపుల కేసు..రాజీ పడ్డారని రద్దు చేయడమేంటి?:సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

లైంగిక వేధింపుల కేసు విషయంలో గురువారం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదుదారుడు , నిందితుడికి మధ్య రాజీ కుదిరిందని కేసు కొట్టేయడమేంటని ప్రశ్నించింది. ఈ మేరకు రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేగాకుండా దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. రాజస్థాన్ లోని గంగాపూర్ ప్రాంతంలో 2022లో ఈ లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ బాలిక ఫిర్యాదు చేసింది. దాంతో పోక్సో చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మైనర్ బాలిక వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. తర్వాత బాలిక కుటుంబం నుంచి భిన్నమైన వాంగ్మూలం వచ్చింది.

అపార్థం తోనే పోలీస్‌లకు ఫిర్యాదు చేశామని, ఆ ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు వద్దని తెలిపింది. దీనికి అనుగుణంగా దిగువ న్యాయస్థానంలో పోలీసులు నివేదిక సమర్పించారు. అయితే దానిని కోర్టు తిరస్కరించడంతో నిందితుడు హైకోర్టుకు వెళ్లాడు. బాధిత కుటుంబం వాంగ్మూలాన్ని అంగీకరించిన హైకోర్టు , ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని పోలీస్‌లకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సామాజిక కార్యకర్త ఒకరు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు గమనించిన అత్యున్నత న్యాయస్థానం , హైకోర్టు తీర్పును రద్దు చేసింది. అలాగే ఈ కేసును తిరిగి విచారించాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News